ముంబయి విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- April 05, 2019
ముంబయి : ముంబయి విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. చెప్పుల్లో పెట్టి బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ముంబయి విమనాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన చేసుకుంది. అమెరికా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేసింది. దీంతో సదరు నిందితుడి వద్ద నుంచి రూ. 11 లక్షల విలువైన 381 గ్రాముల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెప్పుల్లో బంగారం బిస్కెట్లను అక్రమ రవాణా చేస్తుండడంపై అధికారులు ఆశ్చర్యపోయారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







