ఈజిప్ట్‌లో జన్మించిన రెండు తలల చిన్నారి
- April 05, 2019
ఈజిప్టియన్ గవర్నరేట్ ఆఫ్ అస్వాన్, ఓ అరుదైన జన్మకు సాక్ష్యంగా నిలిచింది. ఓ మహిళ రెండు తలలు గల చిన్నారికి జన్మనిచ్చింది. రెండు తలలు, ఒకే గుండెతో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో బిడ్డ జన్మించడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అస్వాన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ధృవీకరించింది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆ చిన్నారిని తల్లితో సహా మరో ఆసుపత్రికి తరలించారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రతినిథి ఎహాబ్ హనాఫి మాట్లాడుతూ, చిన్నారి ఆరోగ్యం బాగానే వున్నట్లు తెలిపారు. ఇది చాలా అరుదైన కేసు అనీ, బేబీకి రెండు స్పైన్స్, ఒక హార్ట్, ఒక ఇంటెస్టైన్ వున్నాయని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత కైరోలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్‌కి బేబీని తరలిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..