కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి
- April 05, 2019
దుబాయ్:90 ఏళ్ళ ఎమిరేటీ మహిళ, తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయింది. తనయుడి మృతదేహం పక్కనే తల్లి మృతదేహాన్ని ఖననం చేశారు కుటుంబ సభ్యులు. గత నవంబర్‌లో అహ్మద్ అనే 68 ఏళ్ళ వ్యక్తికి నెక్ క్యాన్సర్ సోకింది. జర్మనీకి ట్రీట్‌మెంట్ నిమిత్తం వెళ్ళి, స్వదేశానికి తిరిగొచ్చారు. ఇంకోపక్క, వయసు మీద పడ్డంతో పలు అనారోగ్య సమస్యలతో రెండు నెలలుగా తన తల్లి కోమాలో వుందని మృతురాలి మరో తనయుడు అబ్దుల్‌సలామ్ సలెహ్ చెప్పారు. సలెహ్ సోదరుడు అహ్మద్, రషీద్ ఆసుపత్రిలో చికిత్స పొందాడనీ, అదే ఆసుపత్రిలో తన తల్లి కూడా చికిత్స పొందిందనీ, ఏప్రిల్ 2న తన సోదరుడు ప్రాణాలు కోల్పోగా, కోమాలోంచి తన తల్లి బయటకు వచ్చిందనీ, దురదృష్టవశాత్తూ అహ్మద్‌ని ఖననం చేసిన రెండు గంటల తర్వాత తన తల్లి ప్రాణం కోల్పోయిందని చెప్పారు సలెహ్. అల్ ఖోజ్ సిమిటెరీలో తన సోదరుడి సమాధి పక్కనే తన తల్లి సమాధిని కూడా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..