హైదరాబాద్‌: మెట్రో సేవలకు అంతరాయం

- April 05, 2019 , by Maagulf
హైదరాబాద్‌: మెట్రో సేవలకు అంతరాయం

హైదరాబాద్‌లో మెట్రో సేవలకు కాసేపు అంతరాయం కలిగింది. రైల్వే ట్రాక్‌లపై ఫ్లెక్సీలు పడడంతో మెట్రో ట్రైన్లను కొద్దిసేపు నిలిపేశారు. ఫలితంగా హైటెక్‌సిటీకి వెళ్లే దారిలో మెట్రో ట్రైన్లు కాసేపు ఆగిపోయాయి. ఈ సాయంత్రం భాగ్య నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు విపరీతమైన ఎండతో అల్లాడిపోగా, అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. ఉరుములు-మెరుపులతో వర్షం పడింది. ఈదురుగాలులు వీశాయి. ఆ గాలుల ధాటికి ఫ్లెక్సీలు తెగి రైల్వే ట్రాక్‌లపై పడిపోయాయి. దాంతో ఆ మార్గంలో ట్రైన్‌ సర్వీసులను ఆపేశారు. ట్రాక్‌లపై నుంచి ఫ్లెక్సీలను తొలగించిన తర్వాత మళ్లీ మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com