వలసలపై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన ట్రంప్
- April 07, 2019
వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అక్రమ వలసదారులు, శరణార్థు లకు అమెరికాలో చోటు లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా ఇప్పటికే నిండిపోయిందని, ఇకపై వలసదారులను తమదేశంలోకి అనుమతించబోమని చెప్పారు. కొత్తగా ఎవరికీ ఆశ్రయం ఇవ్వబోమని, సరిహద్దుల్లో ఉన్నవాళ్లంతా వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు.
కాలిఫోర్నియాలోని కలెక్సికోలో సరిహద్దు గస్తీ బృందాలు, అధికారులతో ట్రంప్ సమావేశమయ్యారు. అమెరికాలో వల సల వ్యవస్థ భారంగా మారిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐతే, ట్రంప్ రాకను నిరసిస్తూ మెక్సికో సరి హద్దు వద్ద మెక్సికలీ పట్టణంలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్‌ను శిశువులా పేర్కొంటూ ఒక భారీ బెలూన్ను ఎగురవేశారు. అమెరికా, మెక్సికో జెండాలు పట్టుకొని కుటుంబాలను విడదీయవద్దు అనే ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికావైపు మాత్రం ట్రంప్‌కు మద్దతు లభించింది. విమానాశ్రయం నుంచి ట్రంప్ కాన్వాయ్ వస్తుండగా రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి గోడ నిర్మించండి అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
ఇక, మెక్సికోపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. సరిహ్దదుల మూసివేత మెక్సికో ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోందని కితాబిచ్చారు. ఐతే అక్రమ వలసలు-మాదకద్రవ్యాల రవాణాను పూర్తి స్థాయిలో ఆపకపోతే మెక్సికో నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం ఛార్జిలు విధిస్తామని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించడానికి మెక్సికోకు ఏడాది సమయం ఇచ్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..