ఎప్పుడప్పుడా అని చూస్తున్న హైదరాబాద్ జేఎన్‌టీయూ ప్లైఓవర్ ప్రారంభం
- April 07, 2019
నగరవాసులు ఎప్పుడప్పుడా అని చూస్తున్న హైదరాబాద్ జేఎన్‌టీయూ ప్లైఓవర్ ప్రారంభమైంది. మలేషియన్ టౌన్‌షిప్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి జేఎన్‌టీయూ వరకు నిర్మించిన ప్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్లై ఓవర్ ప్రారంభించాలని నగరవాసుల డిమాండ్ మేరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా ప్లై ఓవర్‌ను ప్రారంభించారు. 1.20 కిలో మీటర్ల పోడవు ఉన్న ఈ ప్లైఓవర్‌ను 97 కోట్ల వ్యయంతో నిర్మించారు.
లక్షలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సామాజిక మాద్యమాల ద్వారా నెటిజన్లు ఫిర్యాదు చేశారు. నిజాంపేట్, ప్రగతి నగర్, కూకట్ పల్లి నుంచి హైటెక్ సిటీకి ఇరువైపుల రోజుకు దాదాపు లక్షా అరవై వేల వావానాలు ప్రయాణిస్తున్నాయి . ఎట్టకేలకు ప్లైఓవర్ ప్రాంరంభం కావడంతో కూకట్‌పల్లి రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మలేషియన్ టౌన్ షిప్ మీదుగా హైటెక్ సిటీకి వెళ్లే లక్షలాది మంది నగరవారసులు సాఫీగా , సులభంగా ప్రయాణం చేసేందుకు వీలయింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







