టీవీ చర్చలో యాంకర్‌పై..
- April 07, 2019
అది టీవీ డిబేట్..లక్షలాది మంది చూస్తారన్న కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తాడో నాయకుడు. మాటల్లో చూపించిన ఆవేశాన్ని చేతల్లో చూపించాడు. ఓ టీవీ చానెల్లో సీరియస్‌గా చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు ఒకరు సహనం కోల్పోయారు. అతన్ని..బీజేపీ నేత దేశద్రోహి అనడంతో ఒకసారిగా కోపంతో ఊగిపోయాడు. వెంటనే చేతులకు పని చేప్పాడు. నీళ్ల గ్లాస్ తీసుకుని ప్రత్యర్థిపైకి విసిరేశాడు. దీంతో బీజేపీ నేత మీద ఆ నీళ్ళు కాస్త టీవీ యాంకర్‌తో పాటు అందరీపై పడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ ప్రైవేటు టీవీ చానెల్ “భారత ఆర్మీ- ప్రస్తుత ఎన్నికలు” అనే అంశంపై లైవ్ చర్చ నిర్వహించింది. ఈ డిబెట్లో బీజేపీ నుంచి కేకే శర్మ, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అలోక్ శర్మ, పలువురు విశ్లేఫకులు పాల్గోన్నారు. ఈ చర్చలో అలోక్-శర్మల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అలోక్ శర్మను ఉద్దేశించి బీజేపీ నేత కేకే శర్మ ‘దేశద్రోహి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన అలోక్ శర్మ అసభ్య పదజాలంతో అతనిపైకి ఎదురుగా ఉన్న నీళ్ల గ్లాస్‌ను విసిరేశారు. ఈ క్రమంలో స్టూడియోలో ఉన్నవారందరిపై నీళ్లు పడ్డాయి. అలోక్ శర్మ ఆవేశాన్ని చూసి యాంకర్‌తోపాటు మిగతా ప్యానెలిస్టులు బిత్తరపోయారు. అనంతరం ఇద్దరు నేతలను చర్చను బహిష్కరించి యాంకర్ మిగతా చర్చను కొనసాగించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







