ఏప్రిల్ 15న తొలి ఆక్వేరియం కలిగిన మాల్ ప్రారంభం
- April 09, 2019
మస్కట్: ఒమన్‌లో తొలి అక్వేరియం కలిగిన మాల్ ఆఫ్ మస్కట్ ఏప్రిల్ 15న ప్రారంభం కానుంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ మేరకు ఆన్‌లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. సుల్తానేట్‌లో ఇలాంటిది ఇదే తొలిసారి అని మినిస్ట్రీ పేర్కొంది. అక్వేరియం ఆఫ్ ఒమన్, ది రిక్రియేషనల్ సిటీ (ఫాబి ల్యాండ్), స్నోపార్క్ మరియు నోవో సినిమాస్ కాంప్లెక్స్ వంటివి మాల్ ఆఫ్ మస్కట్‌లో వున్నాయి. సయష్ట్ర్యద్ హైతమ్ బిన్ తారిక్ అల్ సైద్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అల్ జర్వాని గ్రూప్‌కి చెందిన ఫ్లాగ్ షిప్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కమర్షియల్ సెంటర్‌ని ఆయన ప్రారంభిస్తారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని అల్ మాబెలాలో మాల్ ఆఫ్ మస్కట్ కొలువుదీరింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







