తమ్ముడిని గదిలోకి తీసుకెళ్లి.. అక్క నీచంగా..
- April 09, 2019
బ్రెజిల్:స్మార్ట్ యుగం లో ఒకవైపు యువత టెక్నాలజీతో పరుగెడుతూ ఉంటే.. మరోవైపు కొందరు క్షుద్రపూజలతో అభంశుభం తెలియని చిన్నారులను బలితీసుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వస్తున్న ఈ కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాలు, క్షుద్రపూజలు అంటూ అమాయకులను పొట్టనపెట్టుకుంటున్నారు. మానవాతీత శక్తులు పొందాలని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. సొంత తమ్ముడు అనే జాలి లేకుండా.. ఘోరంగా చంపేసి.. అతని మర్మాంగాలను కోసుకుని తినేసింది. బ్రెజిల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ.. కూతురు, కొడుకుతో కలిసి నివాసముంటుంది. 18 ఏళ్ల కూతురుకి చిన్నతనం నుంచి క్షుద్రపూజలంటే ఎంతో ఆసక్తి. మానవాతీత శక్తులు పొందాలని ఎంతో ఆసక్తిగా వీడియోలు చూసేది. వయస్సుతో పాటు తనలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ రోజు తల్లి మార్కెట్‌కు వెళుతూ 5ఏళ్ల తమ్ముడిని చూసుకొమ్మని చెప్పింది. తమ్ముడితో ఆడుతున్న సమయంలో ఆమెలో దాగివున్న మూఢనమ్మకం నిద్రలేచింది. దీంతో తమ్ముడిని వీడియో గేమ్ ఆడదామని తన బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లింది. గదిలోకి తీసుకెళ్లి, తమ్ముడిని దిండుతో ఊపిరాడనివ్వకుండా చంపేసింది. తర్వాత అతడి మర్మాంగాలను కోసుకుని తినేసింది. తమ్ముడి శవం చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి.. మధ్యలో కూర్చొని పూజలు చేసింది.
ఇంతలో మార్కెట్‌కి వెళ్లి.. తిరిగివచ్చిన తల్లి.. లోపల కనిపించిన దృశ్యాలను చూసి షాకైంది. స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గదిలో డ్రగ్స్ దొరకడంతో.. డ్రగ్స్ మత్తులో ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె మొబైల్ మంటల్లో కాలిపోవడం.. మెమరీకార్డుని కూడా ఆమె కాల్చి బూడిద చేయడం విశేషం. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







