మిస్సింగ్‌ చిన్నారి కార్‌ ట్రంక్‌లో గుర్తింపు

- April 10, 2019 , by Maagulf
మిస్సింగ్‌ చిన్నారి కార్‌ ట్రంక్‌లో గుర్తింపు

షార్జా:ఆశ్చర్యకరమైన రీతిలో రెండేళ్ళ బాలుడు, కార్‌ ట్రంక్‌లో గుర్తించబడ్డాడు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడు తప్పిపోయాడంటూ షార్జా పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం బాలుడ్ని కార్‌ ట్రంక్‌లో గుర్తించిన తల్లిదండ్రులు, ఆ ట్రంక్‌ని బ్రేక్‌ చేసి క్షేమంగా ఆ బాలుడ్ని బయటకు తీశారు. బయటకు తీసిన అనంతరం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. షార్జా పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com