అమెజాన్‌లో ఫ్లైట్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు
- April 10, 2019
ఈ కామర్స్ దిగ్గజంగా వెలుగొందుతున్న అమెజాన్ ఇండియా తన సేవలను మరింత విస్తరిస్తోంది. త్వరలోనే ఈ అమెజాన్ ద్వారా విమాన యాన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది.
ట్రావెల్ సైట్ క్లియర్‌ట్రిప్ జతకట్టిన అమెజాన్.. ప్రస్తుతం విమాన టికెట్ బుకింగ్ సర్వీసు మన ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం పరీక్ష దశలోనే ఉన్న ఈ సేవలు అతి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కామర్స్ సేవల్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ విమానయాన సేవలతోపాటు హోటల్స్ బుకింగ్స్, క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, తదితర సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది.
తన కార్యకలాపాలను విస్తరించేందుకు టోప్జో(బహుళ సేవల యాప్)ను అమెజాన్ వినియోగించుకోనుంది. అమెజాన్ ఇండియాలో స్టార్టప్ కంపెనీ టోప్జో తన సేవలను అందిస్తోంది.
టోప్జోను గత సంవత్సరమే అమెజాన్ హస్తగతం చేసుకుంది. ఇది ఇలావుంటే, తాజాగా ప్రచారం జరుగుతున్న ఫ్లైట్ బుకింగ్ సర్వీసు వార్తలపై అటు అమెజాన్ ఇండియా గానీ, ఇటు క్లియర్‌ట్రిప్ సంస్థ గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







