ఎంబసీకి బస్ సౌకర్యం కల్పించాలి: కార్మికులు
- December 31, 2015
పార్శిఆమిక ప్రాంతంలోని తక్కువ ఆదాయం గల సింగిల్ వర్కర్స్ మెరుగైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కోరుతున్నారు. ఉదయం వేళల్లో ఎంబసీకి వెళ్ళేందుకు సులువుగా సరైన బస్ సౌకర్యం కావాలని అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా ఆసియాకి చెందిన కార్మికులు, ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. మౌసలాత్ తమ అభ్యర్థనను మన్నించాలని వారు కోరుతున్నారు. బస్ సౌకర్యం లేకపోవడంతో సరైన సమయంలో ఎంబసీకి డాక్యుమెంట్లు సమర్పించలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా, శ్రీలంక ఎంబసీలకు వెళ్ళేందుకు ఒక్కోసారి కార్మికులు కాలినడకను ఆశ్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అధిక మొత్తం చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవలసి వస్తుంది. అలాగే వివిధ రూట్లలో ప్రయాణిస్తున్న సాధారణ పౌరులూ బస్ రూట్లను వివిధ ప్రాంతాలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







