రోడ్డు ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్‌

- April 11, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్‌

బహ్రెయిన్: మేజర్‌ హైవేపై స్కూల్‌ బస్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే ఈ ప్రమాదం కారణంగా విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ హైవే - షేక్‌ ఇసా బిన్‌ సల్మాన్‌ హైవే మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌ బస్‌, మరో రెండు వాహనాలు ఈ ప్రమాదానికి గురయ్యాయి. ఇదిలా వుంటే, షేక్‌ జబెర్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా స్ట్రీట్‌లో ట్రక్‌ ఒకటి ట్రాఫిక్‌ సిగ్నల్‌లోకి దూసుకెళ్ళడంతో మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగానూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇదిలా వుంటే ఈ వారం పలు ప్రమాదాలు జరిగాయి. 18 ఏళ్ళ బాలుడు ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com