అబుదాబీ ట్యాక్సీల్లో వైఫై
- December 31, 2015
అబుదాబీ ట్యాక్సీలు ఇకపై ప్రయాణీకులకు వైఫై సౌకర్యాన్ని అందించనుంది. అయితే ఏమాత్రం అదనపు ఖర్చూ లేకుండా ప్రయాణీకులు వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. 'వన్ టారిఫ్ ఫర్ ఆల్ సిల్వర్ ట్యాక్సీస్' అనే క్యాంపెయిన్ బుధవారం ప్రారంభమయ్యింది. అబుదాబీలోని నాలుగు ప్రాంతాల్లో ఈ క్యాంపెన్‌ని ప్రారంభించారు. సిల్వర్ ట్యాక్సీస్ విభాగంలో 270 మెర్సిడెస్ విటో కాంపాక్ట్ ట్యాక్సీలను కొత్తగా పొందుపరిచారు. ప్రయాణీకులకు అందించే సౌకర్యాల గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యమని జనరల్ మేనేజర్ మహమ్మద్ దర్విష్ అల్ కెమిజి చెప్పారు. వైఫై సర్వీసులతోపాటు, చిల్డ్రన్ సేఫ్టీ కార్ సీట్స్‌ని తమ ట్యాక్సీలలో వినియోగిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ డిస్కౌంట్ కార్డులు సామాజిక సబ్సిడీ బెనిఫీసియర్స్ కోసం అందించనున్నారట. విడాకులు తీసుకున్న మహిళలకు, భర్త చనిపోయిన భార్యలతోపాటు సోషల్ సబ్సిడీ ఉన్నవారికి ఛార్జీల్లో 60 శాతం డిస్కౌంట్ ఉంటుంది
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







