రోడ్డు ప్రమాదంలో 11 ఏళ్ళ బాలిక మృతి
- April 13, 2019
రస్ అల్ ఖైమా:11 ఏళ్ళ ఆసియా టీనేజర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రస్ అల్ ఖైమాలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా, 23 ఏళ్ళ ఎమిరేటీ నడుపుతున్న ఎస్‌యూవీ ఈ ప్రమాదానికి కారణమయ్యింది. రస్ అల్ ఖైమా సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి మాట్లాడుతూ, గురువారం రాత్రి 8.30 నిమిషాల సమయంలో ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిందని చెప్పారు. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎనాక్ట్‌మెంట్ డైరెక్టర్ కెప్టెన్ హమాద్ అల్ షెహి మాట్లాడుతూ, ప్రాథమిక సమాచారాన్ని బట్టి బాధితుడు ఇంటర్నల్ రోడ్డుపై జాగింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. అనూహ్యంగా బాధితురాలు రోడ్డు మీదకు వచ్చేయడంతో వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి తప్పించడానికి సమయం దొరకలేదని పోలీస్ అధికారులు వివరించారు. పారామెడిక్స్, బాధితురాల్ని రక్షించేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన నడిచేవారు చాలా అప్రమత్తంగా వుండాలనీ, వాహనదారులు సైతం ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







