షార్జా - ఖోర్ ఫక్కాన్ రోడ్డు ప్రారంభం
- April 13, 2019
89 కిలోమీటర్ల మేర షార్జా ఖోర్ ఫక్కాన్ రోడ్డు ప్రారంభమవుతోంది. హజర్ మౌంటెయిన్స్ మీదుగా ఈ మార్గాన్ని నిర్మించారు. 5.5 బిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో నిర్మించబడిన ఈ రోడ్డుతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాల వరకు తగ్గుతుంది. ఈ రోడ్డులో మొదటి పార్ట్ 65 కిలోమీటర్ల మేర వుంటుంది. ఇందులో డ్యూయల్ క్యారేజ్ వే కాగా 7.4 మీటర్ల లేన్స్ ఇరువైపులా వుంటాయి. 10 మీటర్ల వెడల్పైన సెంట్రల్ రిజర్వేషన్‌తో దీన్ని ఏర్పాటు చేశారు. 14 ఇంటర్సెక్షన్స్, ఏడు అండర్ పాస్‌లు, కొన్ని స్లిప్‌వేలు వున్నాయి ఈ రోడ్డులో. మరో సెక్షన్ 24 కిలోమీటర్ల మేర వుంది. ఈ రోడ్డులో ఐదు టన్నెల్స్ వున్నాయి. రెస్ట్ హౌస్, ఇతర ఏర్పాట్లు అల్ రుఫైస్సా డామ్ వద్ద ఏర్పాటు చేశారు. ఇందులో ఓ మాస్క్ కూడా కొలువుదీరి వుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







