సంప్రదాయ బద్ధంగా శ్రీలంక న్యూ ఇయర్ వేడుకలు
- April 13, 2019
శ్రీలంకన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని 15,000 మందికి పైగా శ్రీలంకన్స్ సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. జబీల్ పార్క్ వద్ద శ్రీలంకన్స్‌తోపాటు పెద్ద సంఖ్యలో ఇతర దేశాలకు చెందినవారూ హాజరై ఈ వేడుకల్ని తిలకించారు. 'యూఏఈ-శ్రీలంక టోలెరెన్స్ రన్' పేరుతో స్పెషల్ మారథాన్‌ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీలంక కాన్సుల్ జనరల్ చరిత యట్టగోడా ప్రారంభించారు. సింహళీ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యట్టగోడా వివరించారు. కానా ముట్టి, కట్టా పోరా, అలియాటా అసా తబీమా, సంగావు అమ్ముత్తా సెవీమా, కోకోనట్ స్క్రాపింగ్, చేతుల్ని వినియోగించకుండా బన్ తినడం వంటి సంప్రదాయ ఆటల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. టగ్ ఆఫ్ వార్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఫోక్ డాన్స్ ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్ సందర్శకుల్ని అలరించాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







