స్టెమ్‌ సెల్‌ డోనర్స్‌గా మారండి

- April 13, 2019 , by Maagulf
స్టెమ్‌ సెల్‌ డోనర్స్‌గా మారండి

రియాద్‌:స్టెమ్‌ సెల్‌ రిజిస్టర్‌లో జాయిన్‌ అవ్వాల్సిందిగా సౌదీలను అభ్యర్థిస్తున్నారు. దేశంలోనూ, పొరుగు దేశాల్లోనూ వున్న సౌదీలు స్టెమ్‌ సెల్‌ రిజిస్టర్‌లో భాగం కావాలన్నది ఈ పిలుపు తాలూకు ఉద్దేశ్యం సౌదీ అరేబియాలో 30 శాతం అడల్ట్‌ పేషెంట్లు, 60 శాతం చిన్న పిల్లలైన పేషెంట్లు కుటుంబంతో మ్యాచ్‌ అవని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ నేపథ్యంలో స్టెమ్‌ సెల్‌ రిజిస్టర్‌ చాలా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందే వీలుంది. లుకేమియా, నాన్‌ హోడ్గికిన్స్‌ లింఫోమా వంటి వ్యాధులకు స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఎంతో ఉపయోగపడుతుంది. స్టెమ్‌సెల్‌ డోనర్స్‌ రిజిస్టర్‌ హెడ్‌, కింగ్‌ ఫైసల్‌ స్పెషలిస్ట్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డాక్టర్‌ ఫిరాస్‌ అల్‌ ఫ్రెహ్‌ మాట్లాడుతూ, యువ సౌదీ మహిళ ఒకరు అమెరికాలోని ఓ రోగికి తన స్టెమ్‌ సెల్స్‌ని ఇవ్వడం జరిగిందని చెప్పారు. స్టెమ్‌ సెల్‌ ఎక్స్‌ఛేంజ్‌ విషయంలో అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సౌదీలో మొత్తం 71,000 మంది డోనర్స్‌ ఇప్పటికే రిెజిస్టర్‌ చేసుకున్నారని చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com