స్టెమ్ సెల్ డోనర్స్‌గా మారండి
- April 13, 2019రియాద్:స్టెమ్ సెల్ రిజిస్టర్లో జాయిన్ అవ్వాల్సిందిగా సౌదీలను అభ్యర్థిస్తున్నారు. దేశంలోనూ, పొరుగు దేశాల్లోనూ వున్న సౌదీలు స్టెమ్ సెల్ రిజిస్టర్లో భాగం కావాలన్నది ఈ పిలుపు తాలూకు ఉద్దేశ్యం సౌదీ అరేబియాలో 30 శాతం అడల్ట్ పేషెంట్లు, 60 శాతం చిన్న పిల్లలైన పేషెంట్లు కుటుంబంతో మ్యాచ్ అవని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ నేపథ్యంలో స్టెమ్ సెల్ రిజిస్టర్ చాలా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందే వీలుంది. లుకేమియా, నాన్ హోడ్గికిన్స్ లింఫోమా వంటి వ్యాధులకు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. స్టెమ్‌సెల్ డోనర్స్ రిజిస్టర్ హెడ్, కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ ఫిరాస్ అల్ ఫ్రెహ్ మాట్లాడుతూ, యువ సౌదీ మహిళ ఒకరు అమెరికాలోని ఓ రోగికి తన స్టెమ్ సెల్స్‌ని ఇవ్వడం జరిగిందని చెప్పారు. స్టెమ్ సెల్ ఎక్స్ఛేంజ్ విషయంలో అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సౌదీలో మొత్తం 71,000 మంది డోనర్స్ ఇప్పటికే రిెజిస్టర్ చేసుకున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్