ఇరాన్ లో వరదలు...76 మంది మృతి
- April 15, 2019
టెహ్రాన్ : ఇరాన్ దేశంలో సంభవించిన వరదలతో 76 మంది మృత్యువాత పడగా, వందలాది మంది గాయాల పాలయ్యారు. ఇరాన్ దేశంలోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల్లో 76 మంది మరణించారని ఇరాన్ అధికారి అహద్ వాజిపేహ్ వెల్లడించారు. ఇరాన్ లోని 25 రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరాన్ అధికారులు వరద సహాయ పనులు చేపట్టారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







