దుబాయ్‌లో శ్రీ గణపతి సచ్చిదానంద 'పూర్ణ చంద్ర రాగ సాగర'
- April 16, 2019
దుబాయ్:దత్త యోగ సెంటర్, యూఏఈ నేతృత్వంలో పూర్ణ చంద్ర రాగసాగర పేరుతో మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అనే ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 19న ఈ ఈవెంట్ జరుగుతుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సింథసైజర్పై పెర్ఫామ్ చేయబోతున్నారు. ప్రముఖ వయోలిన్ కళాకారుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం కూడా తన ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. పండిట్ అనిందో చటర్జీ తబ్లా మరియు విద్వాన్ వి సురేష్ ఘటమ్ ఇతర ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. ఆధ్మాత్మిక గురువు అయిన గణపతి సచ్చిదానంద స్వామీజీ గ్రేట్ మ్యుజీషియన్ కూడా.పలు దేశాల్లో ఇప్పటికే ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చి వున్నారు. ఆయన సంగీతం వినేవారికి సరికొత్త అనుభూతిని మిగుల్చుతుంది. 300కి పైగా మ్యూజిక్ కాన్సెర్ట్స్లో స్వామీజీ పాల్గొన్నారు. ఐ ట్యూన్స్, ప్లే స్టోర్‌లో 250కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా ఆయనవి అందుబాటులో వున్నాయి. దుబాయ్ ఒపెరాలో స్వామీజీ మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం ఏర్పాట్లు ఇప్పటికే జోరందుకున్నాయి.

తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







