పాకిస్తాన్ ను ఆ లిస్ట్ లో చేర్చేసిన అమెరికా

- April 16, 2019 , by Maagulf
పాకిస్తాన్ ను ఆ లిస్ట్ లో చేర్చేసిన అమెరికా

వాషింగ్టన్: తీవ్రవాదం కారణంగా పాకిస్తాన్‌ వెళ్లేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు సూచించింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) తదితర ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలనీ... ఉగ్రవాద దాడులు అధికంగా జరిగే ఈ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరిన్లకు సూచించింది. తాజాగా అమెరికా విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజరీలో పాకిస్తాన్ ప్రమాదకరమైన 3వ స్థానంలో(లెవెల్ 3) ఉండగా... పాక్‌లోని బలూచిస్తాన్, కేపీకే ప్రావిన్స్ సహా పీవోకే, భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాలను అత్యంత ప్రమాదకరమైన ''లెవెల్ 4'' కేటగిరీలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ముప్పు ఎక్కువగా ఉన్నందున తమ పౌరులు ఇక్కడికి వెళ్లవద్దని అమెరికా సూచించింది.

''పాకిస్తాన్, పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో పౌర విమానయానానికి అధిక ముప్పు ఉన్నందున ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఇప్పటికే నోటీస్ టు ఎయిర్‌మెన్ (ఎన్‌వోటీఏఎం), స్పెషల్ ఫెడరల్ ఏవియేషన్ రెగ్యూలేషన్ (ఎస్ఎఫ్ఏఆర్) జారీ చేసింది..'' అని సదరు ట్రావెల్ అడ్వైజరీలో అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రజా రవాణా సౌకర్యాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సైనిక ప్రాంతాలు, ఎయిర్‌పోర్టులు, యూనివర్సిటీలు, పర్యాటక ప్రాంతాలు, పాఠశాలలు, హాస్పత్రులు, ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యలయాలు సహా అన్ని చోట్లా పాకిస్తాన్‌లో ఉగ్రదాడుల ముప్పు ఉందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. గతంలో ఉగ్రవాదులు పలుమార్లు అమెరికా దౌత్యవేత్తలు, దౌత్యకార్యాలయాలు లక్ష్యంగా దాడులు చేశారనీ.. ఇప్పటికీ ఇదే తరహా దాడులు కొనసాగవచ్చని తమకు సమాచారం ఉందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com