ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఫెర్రిస్‌ వీల్‌ 'అయిన్‌ దుబాయ్‌' 2020లో ప్రారంభం

- April 17, 2019 , by Maagulf
ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఫెర్రిస్‌ వీల్‌ 'అయిన్‌ దుబాయ్‌' 2020లో ప్రారంభం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అబ్జర్వేషన్‌ వీల్‌, అయిన్‌ దుబాయ్‌ ఎక్స్‌పో 2020 దుబాయ్‌ సెలబ్రేషన్‌ నాటికి పూర్తవుతుందని మెరాస్‌ వెల్లడించింది. 250 మీటర్ల ఎత్తున రూపొందుతోన్న ఈ నిర్మాణం తొలి ఫెర్రిస్‌ వీల్‌తో పోల్చితే 200 రెట్లు ఎత్తయినది. 450 టన్నుల తాత్కాలిక స్పోకన్‌ని ఈ స్ట్రక్చర్‌ నుంచి విజయవంతంగా తొలగించి, పర్మనెంట్‌ స్పోక్‌ కేబుల్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసినట్లు మెరాస్‌ పేర్కొంది. చివరి తాత్కాలిక స్టీల్‌ స్పోక్‌ తొలగించాక వీల్‌ రిమ్‌ వెయిట్‌ మొత్తం 192 స్పోక్‌ కేబుల్స్‌కి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. పూర్తయ్యాక ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అబ్జర్వేషన్‌ వీల్‌గా అయిన్‌ దుబాయ్‌ రికార్డులకెక్కుతుంది. బ్లూ వాటర్స్‌ ఐలాండ్‌ మీద అయిన్‌ దుబాయ్‌ మెయిన్‌ ఎట్రాక్షన్‌ కానుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com