ఆహారంలో పురుగు: ఇండియన్‌ రెస్టారెంట్‌ మూసివేత

- April 18, 2019 , by Maagulf
ఆహారంలో పురుగు: ఇండియన్‌ రెస్టారెంట్‌ మూసివేత

అబుదాబీ ఫుడ్‌ కంట్రోల్‌ అథారిటీ, ముస్సాఫ్ఫా ప్రాంతంలోని మిదిన్‌ రెస్టారెంట్‌ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్‌ సేఫ్టీ విషయమై పలు మార్లు వార్నింగ్స్‌ ఇచ్చినా రెస్టారెంట్‌ యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యిందని అధికారులు పేర్కొన్నారు. పెస్ట్‌ కంట్రోల్‌ సర్వీసెస్‌ అప్లయ్‌ చేయడం, సాధారణ హైజీన్‌ కండిషన్స్‌ని పాటించకపోవడం వంటి కారణాలతో ఇండియన్‌ రెస్టారెంట్‌ని మూసివేశామని అధికారులు వివరించారు. ఎడిఎఫ్‌సిఎ ప్రతినిధి తమీర్‌ రషెద్‌ అల్‌ కాసెమి మాట్లాడుతూ, అసాధారణ రూమ్‌ టెంపరేచర్స్‌ మధ్య ఆహారాన్ని నిల్వ చేస్తున్నారనీ, కూరగాయలు ఓపెన్‌గా వుంచేస్తున్నారనీ, ఈ కారణంగా ఇన్‌సెక్ట్స్‌ పెరుగుతున్నాయని తాము గుర్తించినట్లు చెప్పారు. గత ఏడాది రెండు వార్నింగ్స్‌, ఈ ఏడాది ఇప్పటికే రెండు వార్నింగ్స్‌ ఇచ్చినా రెస్టారెంట్‌ తీరు మారకపోవడంతో మూసివేసినట్లు ఆయన వివరించారు. అపరిశుభ్రావాతావరణంపై సాధారణ ప్రజలు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com