కువైట్‌లో వలసదారులకు హెల్త్ ఫీజు పెంపు
- April 18, 2019
కువైట్ సిటీ: మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బస్సెల్ అల్ సభా, పబ్లిక్ హాస్పిటల్స్‌ని సందర్శించే పేషెంట్లకు కాజువాల్టీ ఫీజును 5 కువైటీ దినార్స్ నుంచి 10 కువైటీ దినార్స్‌కి పెంచుతూ మినిస్టీరియల్ డెసిషన్‌ని జారీ చేశారు. క్యాజువాలిటీ యూనిట్స్‌లో ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ వివరించింది. ముందుగా తమ సమీపంలోని క్లినిక్స్‌లో మాత్రమే పేషెంట్స్ సందర్శించి, అవసరమైనప్పుడు ఆసుపత్రికి వచ్చేలా ఈ కొత్త నిర్ణయం తోడ్పడుతుందని మినిస్ట్రీ పేర్కొంది. ఇదిలా వుంటే, టీనేజర్స్ ఆరోగ్యానికి సంబంధించి నేషనల్ స్ట్రేటజీ తయారు చేసేందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మినిస్టర్ నిర్ణయించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ హెల్త్ డిపార్ట్‌మెంట్, డైరెక్టర్ ఆఫ్ సోషల్ హెల్త్ డిపార్ట్‌మెంట్, డైరెక్టర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్, డైరెక్టర్ ఆఫ్ కువైట్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇందులో మెంబర్స్‌గా వుంటారు. రాపోటర్‌గా డైరెక్టర్ ఆఫ్ పిడియాట్రిక్ డిపార్ట్‌మెంట్స్ బోర్డ్ వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







