బ్యాంక్ అకౌంట్‌లో 123,000: తిరిగిచ్చేసిన వలసదారుడు
- April 18, 2019
జోర్డాన్‌కి చెందిన ఓ వ్యక్తికి తన బ్యాంకులో 100,000 దిర్హామ్‌లు డిపాజిట్ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరో 23,000 అతని అకౌంట్‌లో డిపాజిట్ అయ్యాయి. బెలాల్ అల్ హౌరి అనే వలసదారుడికి ఈ వింత అనుభవం ఎదురయ్యింది. వృత్తి రీత్యా ట్రేడ్స్‌మెన్ అయిన ఆ వ్యక్తి తొలుత రోజువారీ ట్రాన్సాక్షన్స్‌లో భాగంగానే ఇదంతా జరిగిందని అనుకున్నారు. అయితే అనుమానం వచ్చి బ్యాంకుని సంప్రదించగా, ఓ ఎమిరేటీ మహిళ ఆ సొమ్ముని డిపాజిట్‌గా చేసినట్లు తెలిసింది. అనుకోకుండా ఆ తప్పిదం జరిగిందని గ్రహించిన బెలాల్ అల్ హౌరి, సదరు మహిళను సంప్రదించి, ఆమె అకౌంట్‌కి తిరిగి సొమ్ముని బదిలీ చేశారు. రెండు బ్యాంకు అకౌంట్‌లు దాదాపు ఒకేలా వుండటంతో పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంకు, అలాగే మహిళ, ఆమె భర్త కూడా బెలాల్ అల్ హౌరి గొప్పతనాన్ని అభినందించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..