ఆర్మ్‌డ్ రోబరీ: 8 మందికి మరణ శిక్ష
- April 18, 2019
క్రిమినల్ కోర్ట్ ఆఫ్ షార్జా, 8 మంది వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. షార్జాలోని ఓ మనీ ఎక్స్‌ఛేంజ్ సెంటర్‌లో జరిగిన దొంగతనానికి సంబంధించి దోషులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా జాతీయులపై ఆర్మ్‌డ్ రోబరీ, పబ్లిక్‌ని భయభ్రాంతులకు గురిచేయడం, డబ్బుని దొంగిలించడం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మరో వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ కేసులో కొందరు తమ నేరాన్ని అంగీకరించగా, మరికొందరు అంగీకరించలేదని తెలుస్తోంది. పోలీసు విచారణలో, నిందితుల దాష్టీకం బయటపడింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించి, వారిపై నేరాభియోగాల్ని నిరూపించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







