రేవ్ పార్టీలో 40 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు
- April 21, 2019
విశాఖ:విశాఖ రేవ్ పార్టీ కేసులో కీలక నిందితుడు సోనూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతన్నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా పార్టీల్లో యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మిగతా ముఠా కోసం వేట కొనసాగుతోంది. వారం కిందట ఆరిలోవ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని రుషికొండ బీచ్‌లో జరిగిన రేవ్ పార్టీలో మొత్తం 60 మంది పాల్గొన్నట్టుగా తేలింది. అందులో 40 మంది అబ్బాయిలు కాగా.. 20 మంది అమ్మాయిలు. వీరందరి కోసం గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి.. ఇచ్చినట్టుగా ఎంక్వైరీలో తేలింది. అలాగే రేవ్ పార్టీలకు డాన్సర్లను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న దానిపైనా ఇప్పుడు ఫోకస్ పెట్టి దానిపైనా దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో ఈ మధ్య కాలంలో పార్టీ కల్చర్ బాగా పెరిగింది. ఐతే.. పబ్‌లు, హైఫై బార్లలో డ్రగ్స్ సరఫరా కూడా జరుగుతోందన్నది ఓపెన్ సీక్రెట్టే. దీంతో.. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు సిటీ పోలీసులు. MDMA , కొకైన్, LCD లాంటివి రుషికొండ రేవ్ పార్టీలో దొరికిన నేపథ్యంలో.. గోవా నుంచి వీటిని ఇక్కడకు తెస్తున్న ముఠాలో ఎవరెరు ఉన్నారన్న దానిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరి కాల్ డేటా ఆధారంగానూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన మానుకొండ సత్యనారాయణను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్లతో అతనికున్న సంబంధాలు.. ఇతర నెట్‌వర్క్‌పై పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







