షార్జా ఛారిటీ ఇంటర్నేషనల్: 41 మిలియన్ దిర్హామ్‌ల రమదాన్ సాయం
- April 22, 2019
షార్జాలోని ఓ ఛారిటీ 41 మిలియన్ దిర్హామ్‌ల ఛారిటీ క్యాంపెయిన్‌ని ఈ ఏడాది రమదాన్ కోసం కేటాయించింది. తద్వారా అవసరమైనవారికి దేశంలోనూ, అలాగే విదేశాల్లోనూ రమదాన్ సాయం అందిచనున్నామని నిర్వాహకులు తెలిపారు. షార్జా ఛారిటీ ఇంటర్నేషనల్ సెక్రెటరీ జనరల్ అబ్దుల్లా అల్ దుకాన్ మాట్లాడుతూ, పవిత్ర రమదాన్ మాసం కోసం ఐదు ఛారిటబుల్ ప్రాజెక్ట్‌లకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. 2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన మీల్స్‌ని 3,000 కుటుంబాలకు అందించడం ఇందులో మొదటిది. 1 మిలియన్ ఇఫ్తార్ మీల్స్‌ని 148 ప్రాంతాల్లో (యూఏఈ), 56 దేశాల్లో 200,000 మీల్స్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జకాత్ అకౌంట్ ద్వారా 15 మిలియన్ దిర్హామ్‌లను వినియోగిస్తారు. పవిత్ర రమదాన్ మాసం ముగిశాక జకత్ అల్ ఫితర్ డిస్ట్రిబ్యూషన్ కోసం 2 మిలియన్ దిర్హామ్‌లను కేటాయిస్తున్నారు. పెద్దయెత్తున మంచి మనసున్నవారి నుంచి అందుతున్న నిధులతో ఇవన్నీ చేయగలుగుతున్నట్లు అల్ దుఖాన్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







