శ్రీలంక పేలుళ్ళను ఖండించిన సుల్తానేట్‌

శ్రీలంక పేలుళ్ళను ఖండించిన సుల్తానేట్‌

మస్కట్‌: అత్యంత కిరాతకంగా జరిగిన వరుస పేలుళ్ళు శ్రీలంకలో పరిస్థితిని భీతావహంగా మార్చేయడంపై ఒమన్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పేలుళ్ళను ఖండిస్తూ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా, దాన్ని అంతమొందించాల్సిందేననీ, ఈ కష్టకాలంలో శ్రీలంకకు తాము అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఒమన్‌ పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంకలో వున్న ఒమన్‌ పౌరుల భద్రత విషయమై అక్కడి ఎంబసీతో మినిస్ట్రీ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు ఫోన్‌ నెంబర్లను ప్రకటనలో పేర్కొని, అత్యవసర సందర్భాల్లో ఒమన్‌ పౌరులు, శ్రీలంకలో ఈ నెంబర్లను సంప్రదించాలని కోరింది. 

 

Back to Top