సోలార్ ప్యానెల్ సామర్ధ్యాన్ని పెంచే రోబోని కనిపెట్టిన సౌదీ విద్యార్థులు
- April 22, 2019
టైఫ్: సౌదీ అరేబియాలోని టైఫ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఓ రోబోని తయారు చేశారు. ఈ రోబో, సోలార్ ప్యానెల్స్ సామర్థ్యాన్ని 14 శాతం వరకు పెంచుతాయి. సోలార్ ప్యానెల్స్‌ని క్లీన్‌గా, డస్ట్ ఫ్రీగా వుంచడమే ఈ రోబో చేసే పని. అహ్మద్ ఫయాజ్ అహ్మద్ మొహమ్మద్, అహ్మద్ అలి జాయెద్ ఔధా ఈ రోబోని యతారు చేశారు. ఈ ఇద్దరూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. సోలార్ ప్యానెల్స్‌పై దుమ్ము పేరుకుపోవడం ద్వారా వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ సమస్యకు రోబో ద్వారా పరిష్కారం కనుగొన్నారు ఈ విద్యార్థులు. హై పెర్ఫామెన్స్, కాస్ట్ ఎఫీషియంట్ స్మార్ట్ రోబోని తయారు చేసిన ఈ విద్యార్థులు అందరి మన్ననలూ అందుకుంటున్నారు. రోబోకి అమర్చిన ప్రత్యేక సెన్సార్ల ద్వారా ప్యానెల్స్ సర్ఫేస్‌పై వున్న దుమ్ము, ధూళిని సమర్థవంతంగా తొలగించడానికి వీలవుతుంది. ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ మొహమ్మద్ సలాహుద్దీన్ మొహమ్మద్ సులేమాన్ మరియు డాక్టర్ ముస్లెహ్ అల్ హార్తి పర్యవేక్షణలో విద్యార్థులు ఈ రోబోని తయారు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







