75 శాతం డ్రగ్‌ ఎడిక్స్‌ 28 ఏళ్ళ లోపువారే

- April 22, 2019 , by Maagulf
75 శాతం డ్రగ్‌ ఎడిక్స్‌ 28 ఏళ్ళ లోపువారే

కువైట్‌ సిటీ: మత్తు మందులకు బానిసలుగా మారినవారిలో 75 శాతం మంది 28 ఏళ్ళ లోపువారేనని ఓ సర్వే తేల్చింది. వీరిలో 220 మందికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందుతోంది. పెరుగుతున్న డివోర్స్‌ కేసులు కూడా ఆయా వ్యక్తులు మత్తు మందులకు బానిసలవడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి సరైన బాటలో పయనించకపోవడం తద్వారా పిల్లలు వక్ర మార్గం పట్టడం జరుగుతోందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో కారణమేంటంటే ఫిజికల్‌ మరియు సెక్సువల్‌ వైలెన్స్‌ చిన్న తనంలోనే ఎదుర్కొనడం. చెడు స్నేహాలు సైతం డ్రగ్స్‌కి యువత బానిసలయ్యేందుకు కారణమవుతున్నాయి. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించడం, ఇంకా కఠినంగా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే డ్రగ్స్‌ అడిక్ట్స్‌ సంఖ్యను తగ్గించగలమని నిపుణులు అభిప్రాయపడ్డారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com