శ్రీలంక పేలుళ్ళలో దుబాయ్ రెసిడెంట్ మృతి
- April 22, 2019
దుబాయ్: శ్రీలంక పేలుళ్ళలో దుబాయ్ రెసిడెంట్ ఒకరు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 61 ఏళ్ళ రజినా, షాంగ్రి లా హోటల్లో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కసార్గోడ్ నుంచి దుబాయ్‌కి వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారామె. వాస్తవానికి రజినా, శ్రీలంక జాతీయురాలు. పెళ్ళి తర్వాత ఆమె కేరళలో తన భర్త వద్దనే వుండేవారు. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాల్లో కుటుంబంతో సహా నివసించారు. గత కొన్నాళ్ళుగా ఆమె కుటుంబం దుబాయ్‌లోనే స్థిరపడింది. రజినా, ఆమె భర్త శ్రీలంకలోని ఆమె సోదరుడు బషీర్‌ని, ఇతర కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వెళ్ళారు. అయితే ఇంతలోనే దురదృష్టకర ఘటన జరిగిపోయింది. బాధితురాలి పిల్లలు అమెరికాలో వుంటున్నారని కుటుంబ సభ్యుల్లో ఒకరైన బీరన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







