తెల్లకార్డులు లేకున్నాఆస్పత్రుల్లో ఉచిత చికిత్స..
- December 31, 2015
ఏపీలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడి అత్యవసర చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా చల్లని కబురందించింది. తెల్లకార్డులు లేకున్నా రోగులకు ప్రభుత్వం సూచించిన స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రోగులకు సీఎంసీవో రెఫరల్ కార్డులు తీసుకోవాలని, ప్రతి రెఫరల్ కార్డుకు ఓ నెంబర్ ఆధారంగా వైద్య సేవలు అందించాలని ఆస్పత్రులకు సూచించింది. సీఎం సహాయనిధి నుంచి ఆన్‌లైన్‌లో ఆ మొత్తాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డబ్బు తీసుకున్నట్లు ట్రస్ట్ దృష్టికి వస్తే క్లెయిమ్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. రెఫరల్ కార్డులు హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీసు, ట్రస్ట్ క్లినిక్, విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, కాకినాడ ప్రభుత్వాస్పత్రుల్లో జారీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







