హైదరాబాద్:స్టేడియంని గాలికి వదిలేసిన అధికారులు..
- April 23, 2019
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ టవర్ ఈదురుగాలులకు కూలిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన ఇప్పుడు స్టేడియం నిర్వహణ తీరుపై పలు సందేహాలకు తావిస్తోంది. టవర్ల నిర్వహణ విషయాన్ని పట్టించుకోని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఫ్లడ్‌లైట్ టవర్‌కి సంబంధిచిన కొన్ని జాయింట్లలో బోల్టులు పూర్తిగా తుప్పుపట్టేశాయి. సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో.. ఇప్పుడు ఈదురుగాలులకు టవర్ నేల కూలింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఏం చెప్తారన్నది కూడా తెలియాలి. ఐతే.. టవర్ కూలిన విధానం.. అక్కడి పరిస్థితులు చూస్తే.. ఇది మెయింటెనెన్స్ లోపమేనని స్పష్టమవుతోందని సిటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎల్బీ స్టేడియంలో మొత్తం నాలుగు టవర్లు ఉన్నాయి. నిన్న ఈదురు గాలులకు ఒక టవర్ కూలిన నేపథ్యంలో మిగతా వాటి పటిష్టతపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రేటర్‌లో ఉప్పల్ స్టేడియం అందుబాటులోకి వచ్చాక.. ఎల్బీ స్టేడియంను ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఉపయోగించడం లేదు. అప్పుడప్పుడు సభలు, సమావేశాలకు అద్దెలకు ఇవ్వడం తప్ప రెగ్యులర్‌గా మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భాలు లేవు. ఈ కారణంగా మెయింటెనెన్స్‌ను పట్టించుకోవడం లేదని, అందుకే.. ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







