కాంపౌండ్ పూల్‌లో మునిగి చిన్నారి మృతి
- April 24, 2019
దుబాయ్:మూడేళ్ళ బాలిక తాను నివసిస్తున్న రెసిడెన్షియల్ కాంపౌండ్‌లోనే వున్న స్విమ్మింగ్ పూల్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. అల్ బర్షాలో ఈ గటన చోటు చేసుకుంది. తన సోదరులు ఇద్దరూ స్కూల్‌కి వెళ్ళడంతో బాలిక, స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుకుంటూ వున్న సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే తండ్రి గెరార్డ్, ఇంట్లోనే వున్నారు ఘటన జరిగిన సమయంలో. పనిచేసుకుంటూ బిజీగా వున్న ఆయన ఒక్కసారిగా తన కూతురు కన్పించకపోవడంతో కలత చెందారు. అయితే, ఆమె నీటిలో మునిగిపోవడాన్ని గుర్తించి, వెంటనే బయటకు తీశారు. తక్షణం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని దుబాయ్ పోలీస్, తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..