లంకలో పేలిన మరో బాంబు
- April 25, 2019
కొలంబో: వరుస బాంబు దాడి ఘటనలతో శ్రీలంక దద్దరిల్లుతోంది. గురువారం ఉదయం రాజధాని కొలంబోకు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుగోడా పట్టణంలో పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దాంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదివారం జరిగిన భయానక దాడుల ఘటన మరువక ముందే శ్రీలంకలో మరిన్ని పేలుళ్లు సంభవిస్తున్నాయి. పోలీసులు నిర్వరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట పేలుడు సంభవిస్తూనే ఉంది. బుధవారం సినిమా థియేటర్‌ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఓ బైక్‌లో బాంబు అమర్చారు. దాన్ని గ్రహించిన పోలీసులు నిర్వీర్యం చేసే క్రమంలో అది పేలింది. ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనల్లో మృతుల సంఖ్య 321కి చేరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







