రన్ ఓవర్ యాక్సిడెంట్: డ్రైవర్ అరెస్ట్
- April 26, 2019
షార్జా:షార్జా పోలీసులు ఓ డ్రైవర్‌ని రన్ ఓవర్ కేసులో అరెస్ట్ చేశారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడినుంచి డ్రైవర్ పారిపోయినట్లు తెలిపిన అధికారులు, ఈ ఘటనలో ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని, బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో అతను మృతి చెందడం జరిగింది. డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలనీ, ప్రమాదాలు జరిగితే అక్కడే వాహనాన్ని ఆపి, బాధితులకు సహాయ చర్యలు అందించాలని షార్జా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..