టీచర్ ఉద్యోగం.. జీతం రూ.3 లక్షలు..
- April 26, 2019
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. పడితే పట్టాలిరా యూ.ఏ.ఈ లో టీచర్ ఉద్యోగం.. అవును మరి అక్కడ పంతులమ్మకి రూ.3 లక్షల జీతమట. ఆహా! అదృష్టమంటే వారిది అని అనుకోకండి. మన దేశం నుంచి వెళ్లిన టీచర్లకు కూడా రూ. 3 లక్షలకు పైగానే జీతం ఇచ్చి మరీ తీసుకుంటున్నారు. ఎమిరేట్ గవర్నమెంట్ స్కూల్స్‌లో పనిచేయడానికి దాదాపు 3,000 మంది టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూ లాంటివి అన్నీ ముంబై, ఢిల్లీ కేంద్రాల్లో జరుగుతాయి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3,04,017 జీతం లభించనుంది. మన దేశంలోని టీచర్లు అందుకుంటున్న వేతనంతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. యూ.ఏ.ఈ వచ్చి ఉద్యోగం చేసే అభ్యర్థుల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించడానికి సిద్ధమవుతోంది గవర్నమెంట్. ఎంపికైన అభ్యర్థుల కుటుంబాల కోసం కొత్త వీసా నిబంధనలను తీసుకురావలనుకుంటోంది. యూ.ఏ.ఈ లో ప్రైవేట్ స్కూళ్లతో సరిసమానంగా ప్రభుత్వ స్కూళ్లు సరైన విద్యను అందించలేకపోతున్నాయట. అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోని విధంగా విద్యార్థులను తయారు చేయాలనుకుంటోంది. ఈ మేరకు టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టింది.
తాజా వార్తలు
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!







