రమదాన్ టెంట్స్‌లో కొత్త స్మోకింగ్ రూల్స్
- April 27, 2019
దుబాయ్ మునిసిపాలిటీ, రమదాన్ టెంట్స్ కోసం కొత్త స్మోకింగ్ రెగ్యులేషన్స్‌ని జారీ చేసింది. హోటల్స్‌కి ప్రత్యేకంగా ఈ రెగ్యులేషన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ రెగ్యులేషన్స్ ప్రకారం రమదాన్ టెంట్స్, హోటల్ బోర్డర్స్ పరిధిలోనే వుండాలి. మిగతా హోటల్ ఫెసిలిటీస్, రెస్టారెంట్స్‌ని మాత్రం ఐసోలేటెడ్‌గా ఈ టెంట్స్ నుంచి వుంచాల్సి వుంటుంది. తాత్కాలిక టెంట్లు అవసరమైన వెంటిలేషన్ కలిగి, అలాగే ఎయిర్ కండిషనింగ్తోపాటు దుబాయ్ స్మోకింగ్ చట్టానికి లోబడి రూపొందించాలి. షాషాకి సంబంధించి సివిల్ డిఫెన్స్ అనుమతి తప్పనిసరి. షిషా ప్రిపేరిగ్ ప్రాంతాలు టెంట్ నుంచి ఐసోలేటెడ్‌గా వుండాలి. షిషాని ఔట్‌డోర్‌లో అందించకూడదు. ఫిర్యాదులు అందితే వాలిడిటీతో సంబంధం లేకుండా మునిసిపాలిటీ పర్మిట్‌ని రద్దు చేసే అవకాశముంది. స్మోక్ ఫ్రీ లొకేషన్లలో 'నో స్మోకింగ్' సైన్ తప్పనిసరి. స్మోకింగ్ ఏరియాస్‌లోకి 18 ఏళ్ళ లోపు వయసువారికి ప్రవేశం వుండకూడదు. స్మోకింగ్ ఏరియాని టెంటుల ఎగ్జిట్స్, ఎంట్రన్స్‌లకు కనీసం 25 అడుగుల దూరంలో వుంచాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







