ఏందో మన బాలయ్య జోరు!
- April 28, 2019
నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మద్య ఏపిలో జరిగిన ఎన్నికల్లో తెగ హల్ చల్ చేశారు..విలేకరులపై అరుపులు..ఫ్యాన్స్ ని తన్నుడు..ప్రత్యర్థులపై మాటల పంచ్ లు ఇలా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ న్యూస్ గా మారుతూ వచ్చారు. ఆ మద్య తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన అన్నకూతురు సుహాసిని కోసం ప్రచారం చేస్తూ నానా హంగామా సృష్టించారు. ఇది అంతా రాజకీయాలు అయితే తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్'బయోపిక్ సినిమాలో నటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా తీశారు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు తీశారు. కానీ ఈ సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు..పైగా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి.
ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి..ఫలితాలు రానున్నాయి..ఈలోగా సినిమాలు ఉంటే సెట్స్ పైకి తీసుకు వెళ్లాలనే ఆలోచనలు ఉన్నారు బాలకృష్ణ. బాలకృష్ణకు 'సింహా', 'లెజండ్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన బోయపాటి, బాలయ్యతో తదుపరి కమిట్ అయిన విషయం తెలిసిందే. కథ బాగా నచ్చడంతో బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి సిద్దమయ్యారు. అంతా బాగుంది కానీ ఈ మద్య బాలయ్య కాస్త లావు అయ్యారట..అయితే సినిమా లో నటించే పాత్రలకు అంత లావు అయితే కష్టమని దర్శకులు చెప్పడంతో బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారట.
ఇక బరువు తగ్గాలంటే కనీసం 3 నెలల సమయం అవసరం కాబట్టి, ఈ లోగా దర్శకుడు కేఎస్ రవికుమార్ తో సినిమాను తీద్దామని అనుకుని, దాన్ని పట్టాలెక్కించేశారు బాలయ్య, ఈ మూవీ త్వరగా ముగిస్తానని, ఆ వెంటనే బరువు తగ్గి బోయపాటి సినిమా షూటింగ్ కు వచ్చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య, ఇప్పుడు కసరత్తులు చేసి బరువు తగ్గి, రవికుమార్ సినిమా తరువాత బోయపాటితో సెట్స్ మీదకు వెళ్తారని సమాచారం. మొత్తానికి ఈసారైన మరో లెజెండ్ తరహా సినిమాలో నటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







