ట్రాఫిక్‌ కంట్రోల్‌ కోసం మొబైల్‌ కెమెరాలు

- April 30, 2019 , by Maagulf
ట్రాఫిక్‌ కంట్రోల్‌ కోసం మొబైల్‌ కెమెరాలు

కువైట్‌ సిటీ: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ 9 మొబైల్‌ కెమెరాలను స్ట్రీట్స్‌ అలాగే మెయిన్‌ రోడ్లపై ఏర్పాటు చేసింది. ట్రాఫిక్‌ జామ్‌లను నివారించేందుకు, షోల్డర్‌ లేన్స్‌ వినియోగించేవారిని మానిటర్‌ చేసేందుకు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది తప్ప, స్పీడ్‌ని మానిటరింగ్‌ చేసేందుకు కాదని సెక్యూరిటీ ఫోర్సెస్‌ పేర్కొన్నాయి. ఇదిలా వుంటే, స్పీడ్‌ కెమెరాల సంఖ్యను రెట్టింపు చేయాలనే ఆలోచనతో మినిస్ట్రీ వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్పీడ్‌ కెమెరాల వినియోగంతో ట్రాఫిక్‌ ప్రమాదాల్ని గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. అలాగే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కీ చెక్‌ పెట్టవచ్చు. ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో మినిస్ట్రీ కీలక నిర్ణయాల్ని అమల్లో పెట్టబోతోంది. కొత్త బ్యాచ్‌ కెమెరాల కోసం మినిస్ట్రీ ఎదురుచూస్తోందనీ, అవి రాగానే ఇన్‌స్టాల్‌ చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com