ఏపీ, ఒడిషాలను వణుకుపుట్టించిన ఫోని.. బెంగాల్ వైపుగా..

- May 03, 2019 , by Maagulf
ఏపీ, ఒడిషాలను వణుకుపుట్టించిన ఫోని.. బెంగాల్ వైపుగా..

ఏపీ, ఒడిషాలను వణుకుపుట్టించిన ఫోని.. పదిన్నర గంటల సమయంలో పూరీ సమీపంలో తీరం దాటింది. తీరం దాటిన సమయంలో గంటకు 180 కిలో మీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో పూరీ తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఆర్టీజీఎస్‌ అంచనాలకు అనుగుణంగానే ఫోని పూరీ తీరం దాటింది. ప్రస్తుతం తుఫాన్‌ బెంగాల్‌వైపుగా పయనిస్తోంది. మేఘాలయ వరకు కొనసాగి అనంతరం ఫోని బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తుఫాన్‌ పూరీ తీరం దాటడడంతో ఉత్తరాంధ్ర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు ఉత్తరాంధ్ర మీదుగా తుఫాన్‌ పయనించడంతో శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు నేలకూలాయి. స్తంభాలు విరిగిపడ్డాయి. తీర ప్రాంతాల్లోని ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. గాలుల ధాటికి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక తీరంలో ఉన్న మత్స్యకారుల పడవలు కూడా బలమైన గాలులకు దెబ్బతిన్నాయి. అటు ఒడిషాలోనూ ఫోని తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టడంతో ఆస్తి, ప్రాణనష్టం భారీగా తప్పింది. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. మరోవైపు రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రహదారులపై విరిగిపడ్డ చెట్లను తొలగించి రాకపోకలను క్లియర్‌ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com