షార్జా లో డెలివరీ బాయ్‌ని గదిలోకి లాక్కెళ్లి…

షార్జా లో డెలివరీ బాయ్‌ని గదిలోకి లాక్కెళ్లి…

షార్జా:ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన డెరివరీ బాయ్‌పై యువతులు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన షార్జాలో జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భాగమైన షార్జా నగరం ఓ అపార్ట్ మెంటులోని ఓ ఫ్లాట్‌ లో ఉంటున్న యువతులు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. దాంతో ఫుడ్ డెలివరీ చేయడానికి ఆ ఫ్లాట్‌కు డెలివరీ బాయ్ వెళ్ళాడు. ఓ యువతి వచ్చి తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ని తమ గదిలోకి తీసుకెళ్లింది. అయితే ఎంతసేపటికి డెలివరీ బేకు డబ్బులు ఇబ్బకుండా అతన్ని బయటే ఉంచింది. దాంతో ఆమె ఎంత సేపటికి బయటికి రాకపోవడంతో డెలివరి బాయ్ బెల్ కొట్టి లోపలి వెళ్ళాడు. ఫుడ్ ఆర్డర్ తాలూకు Dh200బిల్లును చెల్లించమని అడిగాడు. అనుమతి లేకుండా ఇంట్లోకి రావడాన్ని తప్పుబట్టిన ఆ యువతి అతనికి డబ్బులు ఇవ్వలేదు.

ఇదే సమయంలో గదిలోపడి నుండి అనేక మంది యువతులు వచ్చి ఆ డెలివరీ బాయ్‌ని బలవంతంగా లోపడికి లాక్కెళ్లారు. అనంతరం గదిలో ఉన్న లైట్లు అన్ని ఆపేసి డెలివరీ బాయ్‌‌ పై కత్తితో దాడి చేశారు. అంతేకాకుండా అతని దగ్గర ఉన్న ఫోన్‌, జేబులో ఉన్న డబ్బులు కూడా లాక్కున్నారు. అయితే వారి భారీ నుంచి ఎలాగోలా తప్పించుకున్న డెలివరీ బాయ్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన యువతులను అరెస్ట్ చేశారు. బాధితుడి దగ్గరి నుండి లాక్కున్న ఫోన్, డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ యువతులు పోలీసులకు తెలిపారు. కాగా ఈ కేసు విచారణ మే 20కి వాయిదా పడింది.

Back to Top