'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్' చిత్రానికి ఇంటర్నేషనల్ అవార్డ్

'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్' చిత్రానికి ఇంటర్నేషనల్ అవార్డ్

తమిళ స్టార్ ధనుష్ 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్' అనే ఫ్రెంచ్, ఇంగ్లిష్ ల్వాంగ్వేజ్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. కెన్ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా ఇంటర్నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది. బార్సిలోనా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి బెస్ట్ కామెడీ చిత్రంగా ఆడియన్స్ అవార్డ్ దక్కింది.

'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్: హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ఐకియా వాడ్రోబ్' అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ పుస్తకాన్ని మైన్ పురెటోలాస్ రాశారు. ఇందులో ధనుష్ స్ట్రీట్ మెజీషియన్ పాత్రలో నటించాడు. తల్లి అకాల మరణంతో తండ్రిని వెతుక్కుంటూ పారిస్ బయల్దేరే పాత్ర అది. అక్కడ హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది కథ.

గతేడాది ఈ చిత్రం ఫ్రాన్స్‌లో విడుదలైంది. త్వరలో ఇండియాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ నటించిన ఈ విదేశీ చిత్రాన్ని చూసేందుకు అతడి ఇండియన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ధనుష్‌తో పాటు ఇందులో బెరినిక్ బెజో, బార్‌ఖడ్ అబ్ది, ఎరిన్ మోరియార్టి, అబుల్ జఫ్రీ నటించారు.

ఇందులో ధనుష్ పాత్ర పేరు అజాతశత్రు లావష్ పటేల్. తనదైన నటనతో ధనుష్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు. గతేడాది మే 30న ఈ చిత్రాన్ని ఫ్రాన్స్‌లో విడుదల చేశారు. $12.5 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా $13.2 మిలియన్ డార్లు రాబట్టింది.

ధనుష్ ప్రస్తుతం వెట్రి మారన్ దర్శకత్వంలో 'అసురన్' చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఈ తమిళ స్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీ ద్వారా మలయాళ నటి మంజు వారియర్ తొలిసారి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

Back to Top