సిఎస్‌బి: రమదాన్‌ వర్కింగ్‌ అవర్స్‌

- May 04, 2019 , by Maagulf
సిఎస్‌బి: రమదాన్‌ వర్కింగ్‌ అవర్స్‌

పవిత్ర రమదాన్‌ మాసం నేపథ్యంలో అధికారిక పని గంటలు ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే ఉంటాయని సివిల్‌ సర్వీస్‌ బ్యూరో (సిఎస్‌బి) వెల్లడించింది. ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా డైరెక్టివ్స్‌, సివిల్‌ సర్వీస్‌ చట్టం ఆర్టికల్‌ 19 ప్రకారం ఈ పని గంటలు అమల్లోకి రానున్నాయి. వారంలో 36 గంటలు పనిచేసేవారికి 30 గంటల వరకు మాత్రమే పని గంటలు వర్తించేలా ఈ నిబంధన వీలు కల్పిస్తుంది. సిఎస్‌బి యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ ఖాలిద్‌ బిన్‌ ఇబ్రహీమ్‌ అల్‌ ఖలీఫా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎక్స్‌టెండెడ్‌ అవర్స్‌ వర్క్‌ చేస్తున్న ఉద్యోగులకు 40 గంటల నుంచి 33 గంటలకు పని గంటల్ని కుదిస్తారు. వీరికి 8 గగంటల నుంచి 2.45 వరకు పని గంటలు అమల్లో వుంటాయి. గవర్నమెంట్‌ బాడీస్‌, సివిల్‌ సర్వీస్‌కి చెందిన ఇన్‌స్టిట్యూషన్స్‌లో పనిచేసేవారికి ఈ తగ్గింపు వర్తిస్తాయి. ఫ్కెఇ్సబుల్‌ అవర్స్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకి గంట మించరాదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com