రూ.15వేలు మింగేసిన కుక్క..
- May 04, 2019
యూకే:యజమాని పెడితే నాలుగు మాంసం ముక్కలు పరపరా తినేస్తాయి శునకాలు. వాసన చూడకుండా ఏది పెడితే అది తినేయదు. ఆఖరికి పెరుగన్న పెట్టినా అందులో చిటికెడు ఉప్పేస్తేనే కాని ముట్టదు. వాటికిష్టమైన బిస్కెట్లు సరేసరి. మరి అలాంటిది యూకేలోని ఉజ్జీ అనే ఓ శునకం వయసు తొమ్మిదేళ్లు. ఇది ఏకంగా 160 పౌండ్లు తినేసింది. ఆకలేసిందో లేదా డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకుందో ఏమో కాని.. అవి తిని హాస్పిటల్ పాలైంది. యజమాని చెప్పినట్లు చేస్తూ ఆయన అభిమానాన్ని చూరగొంది ఉజ్జీ. లెటర్స్ వచ్చినా రాకపోయిన గేటుకి వుంచిన బాక్స్ ఓపెన్ చేసి చూడడం దానికి అలవాటు చేశారు యజమాని. దాంతో రోజూ అది వెళ్లి చూసేది.
ఏమైనా ఉంటే తీసుకువచ్చి యజమానికి ఇచ్చేది. ఈ క్రమంలో ఇంట్లో టేబుల్ మీద పెట్టిన పర్సు కనిపించకుండా పోయింది. ఇల్లంతా వెతికినా ఎక్కడా కనపడలేదు. ఏమై ఉంటుందో యజమానికి అంతుబట్టలేదు. మరోసారి ఓ కవర్‌లో ఉంచిన రూ.15,000లను యజమాని చూస్తుండగానే నమిలి మింగేసింది. అప్పుడు కానీ ఆయనకి అర్థం కాలేదు. పర్సుని కూడా ఇదే స్వాహా చేసి ఉంటుందని. డబ్బులు పోతే పొయ్యాయి. అవి మింగినందుకు దీనికి ఏమైనా అయితే.. అని గబగబా హాస్పిటల్‌కి పరిగెట్టాడు ఉజ్జీని తీసుకుని. డాక్టర్లు పరీక్షించి దానికడుపులో కవర్‌తో పాటు, పర్సు ఉన్నట్లు తెలుసుకున్నారు. శునకం కడుపులో నుంచి ఆ కరెన్సీ ముక్కలను తీయడానికి పట్టిన ఖర్చు మొత్తం ఎంతనుకున్నారు.. అక్షరాలా రూ.11 వేలు. అది నమిలి మింగిన నోట్ల విలువ.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







