గవర్నమెంట్ స్కూల్స్‌కి రమదాన్ టైమింగ్స్
- May 04, 2019
కతార్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్‌కి పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ద్వారా ఆయా స్కూళ్ళ సమయాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే కిండర్‌గార్టెన్ స్కూల్స్ పనిచేయాల్సి వుంటుంది. గ్రేడ్ 1 నుంచి 12 వరకు విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్స్ వుంటాయి. స్కూల్స్‌కి ఐదు పీరియడ్స్, అందులో ఒక్కో పీరియడ్‌కి 40 నిమిషాలు కేటాయించాలి. అసెంబ్లీ 9 గంటల నుంచి 9.10 గంటల వరకు మాత్రమే వుంటుంది. 11.20 నిమిషాల నుంచి 11.40 నిమిషాల వరకు ఇరవై నిమిషాల పాటు బ్రేక్ వుంటుంది. నాలుగో పీరియడ్ 11.40 నుంచి 12.20 వరకు, ఆఖరి పీరియడ్ 12.20 నుంచి 1 గంట వరకు వుండాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







