జూలైలో స్టార్ట్ కానున్న బిగ్ బాస్ సీజన్ - 3
- May 04, 2019
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించాడు. నానీ దాన్ని కంటిన్యూ చేశాడు మరి ఇప్పుడు నానీ ప్లేస్ ని ఎవరు రీ ప్లేస్ చేస్తారు..? బిగ్ బాస్ షోకి ఫిదా ఐన తెలుగు టెలివిజన్ ఆడియన్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. బిగ్ బాస్ థర్డ్ సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ బిగ్ బాస్ 3కి కొత్త హోస్ట్ ఎవరు..?
బిగ్ హౌస్ 16 నుంచి 18 మంది కంటిస్టెంట్స్ వంద రోజులు బయిటి ప్రపంచానికి దూరంగా ఒకే ఇంట్లో అంతా కలిసి ఉండాలి. 2017లో తెలుగు ఆడియన్స్ కి పరిచమైన ఈ షోకి చాలా తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్ బాస్ ఫస్ట్ అండ్ సెకెండ్ సీజన్స్ ని తెలుగు టెలివిజన్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అందుకే థర్డ్ సీజన్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.
ఇక బిగ్ బాస్ థర్డ్ సీజన్ హోస్ట్ కోసం చాలా మందిని సంప్రదించారు. మరోసారి ఎన్టీఆర్ పేరుని పరిశీలించినా త్రిబుల్ ఆర్ సినిమాకి కమిటై ఉండటంతో తారక్ నో చెప్పేశాడు. నానీ పేరుని ఈ సారి పరిగణలోని తీసుకోలేదు. మధ్యలో హీరోయిన్ అనుష్క పేరు కూడా వినిపించింది. చివరగా సీనియర్ హీరోస్ నాగార్జున, వెంకటేష్ తో సంప్రదింపులు జరిపారు. ఫైనల్ గా గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా వ్యవహరించి షోని సక్సెస్ చేసిన నాగార్జుననే బిగ్ బాస్ థర్డ్ సీజన్ కి హోస్ట్ గా డిసైడ్ చేశారు. ప్రస్తుతం మన్మధుడు 2 షూటింగ్ కోసం పోర్చుగల్ వెళ్లిన నాగ్ ఇండియా తిరిగిరాగానే బిగ్ బాస్ టీంతో జాయిన్ కానున్నాడు. జూలైలో బిగ్ బాస్ థర్డ్ సీజన్ ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







