587 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 04, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ 587 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. ఈ 587 మందిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఈ క్షమాభిక్ష ఇవ్వడం జరిగిందని అధికారులు వివరించారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఛాన్సెలర్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదన్ మాట్లాడుతూ, క్షమాభిక్షతో ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందనీ, క్షమాభిక్ష పొందినవారు కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వుంటుందని ఆకాంక్షించారు. క్షమాభిక్షకు సంబంధించి చట్ట పరమైన చర్యల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇప్పటికే ప్రారంభించిందని ఆయన తెలిపారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గతంలో 3,005 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







